Sun Mar 08 2026 04:40:13 GMT+0530 (India Standard Time)
బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
యాత్రలో భాగంగా నేడు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వేములలో ఆయన పర్యటించారు. అక్కడ ప్రసంగించిన..

వేముల : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండోదశ ప్రజా సంగ్రామయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. యాత్రలో భాగంగా నేడు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వేములలో ఆయన పర్యటించారు. అక్కడ ప్రసంగించిన అనంతరం బండిసంజయ్ పాదయాత్ర మళ్లీ ప్రారంభించారు. స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు అడ్డువెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
టిఆర్ఎస్ కార్యకర్తల వైపుకు బీజేపీ నేతలు దూసుకెళ్లడంతో.. అక్కడే ఉన్న పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుని, చెదరగొట్టారు. బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ కు వ్యతిరేక నినాదాలు చేయగా.. బీజేపీ నాయకురాలు డీకే అరుణ తమ పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది.
Next Story

