Mon Feb 02 2026 00:02:15 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్
ఈ మేరకు జే.పీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో బండి సంజయ్ సహా.. పలువురు ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలకు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఇటీవలే బండి సంజయ్ ను తొలగించి.. ఆ స్థానాన్ని అధిష్టానం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తొలగించడంతో.. ఆయన వర్గం నుంచి తీవ్ర అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. పైకి నవ్వుతూనే కనిపించినా.. బండి సంజయ్ కూడా ఈ విషయంలో బాగా హర్టయ్యారు. తాజాగా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించింది.
ఈ మేరకు జే.పీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో బండి సంజయ్ తో పాటు ఏపీకి చెందిన బీజేపీ నేత సత్యకుమార్ కు జాతీయ కమిటీలో అవకాశమిచ్చింది. బీజేపీ నేతలకు పదవులు కట్టబెట్టింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా బండి సంజయ్, రాధామోహన్ అగర్వాల్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే..బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఏపీ నేత సత్యకుమార్ ను నియమించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికైనా బండి సంజయ్, ఆయన వర్గం సంతృప్తి చెంది.. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తారేమో చూడాలి.
Next Story

