Sat Dec 13 2025 22:33:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మావోయిస్టు కీలక నేత లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీలో కీలక నేత బండి ప్రకాశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు

మావోయిస్టు పార్టీకి వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీలో కీలక నేత బండి ప్రకాశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాశ్ లొంగిపోయారని పోలీసులు తెలిపారు. బండి ప్రకాశ్ మావోయిస్టు పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. అనేక కేసులు ఆయనపై నమోదయి ఉన్నాయి.
గత నాలుగున్నర దశాబ్దాలుగా...
మావోయిస్టు పార్టీలో బండి ప్రకాశ్ గత నాలుగున్న దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు. కీలక బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా బండి ప్రకాశ్ వ్యవహరించారు. వివిధ స్థాయుల్లో పనిచేసిన బండి ప్రకాశ్ లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు. వరసగా మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతుండటంతో ఉద్యమాన్ని నడిపించే వారు రానున్న కాలంలో కరువవుతారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా లొంగిపోవాలంటూ హెచ్చరించడంతో ఇటీవల కాలంలో అగ్రనేతల లొంగుబాట్లు జరుగుతున్నాయి.
Next Story

