Sat Mar 14 2026 17:57:19 GMT+0530 (India Standard Time)
నేడు భద్రాచలం బంద్
భద్రాచలం పట్టణంలో నేడు బంద్ జరుగుతుంది. అఖిలపక్షం ఈ బంద్ కు పిలుపునిచ్చింది

భద్రాచలం పట్టణంలో నేడు బంద్ జరుగుతుంది. అఖిలపక్షం ఈ బంద్ కు పిలుపునిచ్చింది. భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజించడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాత గ్రామ పంచాయతీని యధావిధిగా కొనసాగించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పర్యాటకులకు ఇబ్బంది...
భద్రాచలం పట్టణం బంద్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అఖిలపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. బంద్ సందర్భంగా పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతుతున్నారు.
Next Story

