Sat Mar 28 2026 12:16:46 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు నిర్మల్ పట్టణం బంద్
నేడు నిర్మల్ పట్టణంలో బంద్ జరగనుంది

నేడు నిర్మల్ పట్టణంలో బంద్ జరగనుంది. బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ బంద్ ను నిర్వహిస్తున్నారు. ఒకవర్గంపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ నేతలు నేడు నిర్మల్ పట్టణం బంద్ కు పిలుపు నిచ్చారు. నిర్మల్ పట్టణ బంద్ సందర్భంగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.
బీజేపీ పిలుపు మేరకు...
నిర్మల్ పట్టణ బంద్ కు బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిలుపు ఇవ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్ లు కూడా చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని పోలీసులు హెచ్చరించారు.
Next Story

