Sun Mar 15 2026 20:38:16 GMT+0530 (India Standard Time)
యాదాద్రి అద్భుతం... నందమూరి బాలకృష్ణ
యాదాద్రి అద్భుతమైన ఆలయమని సినీనటుడు బాలకృష్ణ అన్నారు. అఖండ టీంతో కలసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు

యాదాద్రి అద్భుతమైన ఆలయమని సినీనటుడు బాలకృష్ణ అన్నారు. అఖండ టీంతో కలసి ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా యాదాద్రి నిర్మాణం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని పునర్మించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారని బాలకృష్ణ అన్నారు.
సీఎం కేసీఆర్.....
హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బాలకృష్ణ అన్నారు. యాదాద్రిని చూస్తుంటే ఒళ్లు పులకించిపోతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అభినందనీయమని ఆయన ప్రశంసించారు. అంతగా ఈ ఆలయాన్ని నిర్మించారని, దేశంలోనే యాదాద్రి ఆలయం ప్రముఖస్థానాన్ని పొందుతుందన్నారు. అఖండ టీంతో వచ్చిన బాలకృష్ణకు వేద పండితులు ప్రత్యేక దర్శనం చేయించి ఆశీర్వచనాలు అందించారు.
Next Story

