Sun Mar 15 2026 09:38:40 GMT+0530 (India Standard Time)
శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్ మంజూరయింది. ఆయన ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి జైలులో ఉన్నారు.

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్ మంజూరయింది. ఆయన ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి జైలులో ఉన్నారు. ఆయనకు నేడు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా శివబాలకృష్ణ చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో ఈరోజు, రేపట్లో బయటకు వచ్చే అవకాశముంది.
ఆదాయానికి మించి...
హెచ్ఎండీఏ డైరెక్టర్, రెడా డైరెక్టర్ గా ఉన్నప్పుడు భవనాలకు, లే అవుట్ లకు పెద్దయెత్తున అనుమతులు ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. విల్లాలు, భూములు, ఇంటి స్థలాలతో పాటు బంగారం, వెండి, నగదును కూడా స్వాధీనం చేసుకుని ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Next Story

