Thu Mar 19 2026 04:42:58 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కు అంత సీన్ లేదు
జాతీయ స్థాయిలో కేసీఆర్ బీజేపీని ఎదుర్కొనేంత శక్తి లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అన్నారు

జాతీయ స్థాయిలో కేసీఆర్ బీజేపీని ఎదుర్కొనేంత శక్తి లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అన్నారు. ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్బంలో మీడియాతో మాట్లాడుతున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు. ఆయన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి పార్టీ పెట్టుకోవచ్చని సీఎం అన్నారు. ఆ డబ్బులకు మూలం ఎక్కడన్నదే సందేహని ఆయన అన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పటికే కలసి ఉన్నాయని హిమంత బిశ్వ శర్మ అన్నారు.
డబ్బులుంటే పెట్టుకోవచ్చు....
కొత్తగా కేసీఆర్ ప్రతిపక్షాలను కలిపేదేముంటుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణలో నయా నిజాం పాలనను అంతం చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ తమకు దేశంలో పోటీయే కాదన్నారు. 2024 ఎన్నికల్లోనూ బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయని ఆయన అన్నారు.
Next Story

