Thu Mar 19 2026 12:40:11 GMT+0530 (India Standard Time)
ఆయన డీఎన్ఏ చైనాదేనా? రేవంత్ ఫైర్
అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వంత్ శర్మపై పోలీసు కేసులు పెడతామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు

అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వంత్ శర్మపై పోలీసు కేసులు పెడతామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. బిశ్వశర్మ డీఎన్ఏ చైనాదా? అసోందా? అని ఆయన ప్రశ్నించారు. ఒక తల్లిని అవమానించేలా బిశ్వంత శర్మ వ్యవహరించారని రేవంత్ రెడ్డి మండి పడ్డారు. రేపు బిశ్వంత్ శర్మపై కేసులు పెడతామని, ఆ కేసులు నమోదు చేసి కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
రేపు కేసులు పెడతాం....
అమర్యాదకరమైన భాషను బీజేపీ నేతలు వాడుతున్నారన్నారు. బిశ్వంత్ శర్మపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతల మూలాలను, డీఎన్ఏ లను పరిశీలించాల్సి వస్తుందన్నారు. తమ పార్టీ తరుపున దీనిపై కార్యాచరణ ను రూపొందించుకుంటామని చెప్పారు. మోదీ ఇప్పటికైనా హేమంత్ బిశ్వశర్మను సీఎం పదవి నుంచి తొలగించాలని ఆయన కోరారు.
Next Story

