Thu Jan 29 2026 04:11:59 GMT+0000 (Coordinated Universal Time)
అసదుద్దీన్ ప్రశంసలు మామూలుగా లేవుగా!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోరాడనున్నాయి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోరాడనున్నాయి. ఈ సమయంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్కు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పేదల కోసం కేసీఆర్ తీసుకుని వచ్చిన పథకాలు సూపర్ అన్నారు అసదుద్దీన్. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని.. కేసీఆర్ తెలంగాణకు హ్యాట్రిక్ సీఎం అవుతారని ఒవైసీ జోస్యం చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సుఖశాంతుల కోసం మూడోసారి కేసీఆర్ను గెలిపించాలని తెలంగాణ ప్రజలకు అసదుద్దీన్ గత కొద్దికాలంగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పదేళ్ల కాలంలో పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చారని కితాబిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనని.. తెలంగాణలో వారికి స్థానం ఉండకూడదని అసదుద్దీన్ అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్-మజ్లిస్ దోస్తీ మొదటి నుంచీ కొనసాగుతోంది. మజ్లిస్ తమ మిత్రపక్షమని కేసీఆర్ గతంలోనే చెప్పారు. అసదుద్దీన్ తాము తెలంగాణతో పాటు రాజస్థాన్ ఎన్నికల్లోను పలు స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
Next Story

