Sun Mar 15 2026 17:44:44 GMT+0530 (India Standard Time)
Telangana : గ్రామాల్లో ఇక ప్రత్యేక పాలన.. సర్పంచ్ల పాలన ముగియడంతో
గ్రామాల్లో ప్రత్యేక పాలన ప్రారంభమయింది. సర్పంచ్ ల పదవీకాలం ముగియనుండటంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమయిం

గ్రామాల్లో ప్రత్యేక పాలన ప్రారంభమయింది. సర్పంచ్ ల పదవీకాలం ముగియనుండటంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమయింది. ప్రత్యేకాధికారుల పాలన పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల్లో ఇకపై చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఇకపై ప్రత్యేక అధికారులే పర్యవేక్షిస్తారు.
గెజిటెడ్ స్థాయి అధికారులు...
గ్రామ పంచాయతీ పాలన బాధ్యతను గెజిటెడ్ స్థాయి అధికారులకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు సర్పంచ్ లు ఎన్నికలు త్వరితగతిన నిర్వహించాలని, ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ తమనే కొనసాగించాలంటూ సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం నుంచి ఆదేశాలు వెలువడాల్సి ఉంది.
Next Story

