Thu Dec 18 2025 10:13:09 GMT+0000 (Coordinated Universal Time)
Revanth : వివేక్ ను కలిసిన రేవంత్ .. ఇక చేరుతున్నట్లేనా?
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివేక్ వెంకటస్వామిని కలిశారు

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. పాత నేతలకు స్వాగతం పలుకుతుంది. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. బలమైన నేతలను పార్టీలోకి తీసుకు వచ్చి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. అధికారం లోకి రావడమే ముఖ్యం. పార్టీ మారిన నేతలకు సీట్లిచ్చయినా సరే తెలంగాణలో హస్తం జెండాను ఎగరేయాలని భావిస్తున్నారు.
స్యయంగా వెళ్లి...
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని మునుగోడు సీటు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివేక్ వెంకటస్వామిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వివేక్ ను పార్టీలోకి తీసుకు వచ్చి ఆయనకు కూడా శాసనసభ నుంచి పోటీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకే రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. వివేక్ తాను పార్టీ మారడం లేదని చెప్పినప్పటికీ, బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ చీఫ్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడమంటే పార్టీ మారతారేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Next Story

