Tue Mar 24 2026 20:52:34 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి బీఆర్ఎస్ ప్లీనరీలు
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమయింది

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమయింది. ఈరోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి ప్లీనరీకి మూడు వేల మంది ప్రతినిధులు తగ్గకుండా చూడాలని ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. క్యాడర్ ను ఉత్తేజపర్చడంతో పాటు వచ్చే ఎన్నికలలో గెలుపొందేందుకు నియోజకవర్గంలో వ్యూహరచనలకు ఈ ప్లీనరీలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
27న పార్టీ ఆవిర్భావ....
ఉదయం ప్రారంభమైన సభలు సాయంత్రం వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పార్టీ సాధించన విజయాలు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటుగా జాతీయ స్థాయిలో పార్టీ పెట్టడానికి కారణాలను కూడా వివరించాలని నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ ప్లీనరీ తీర్మానాల్లో మొత్తం ఆరు తీర్మానాలు చేయనున్నారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ సభ దినోత్సవం హైదరాబాద్లో జరగనుంది.
Next Story

