Thu Mar 19 2026 05:50:32 GMT+0530 (India Standard Time)
నేడు సామూహిక జాతీయ గీతాలాపన
75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది.

75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేసీఆర్ హైదరాబాద్ లోని ఆబిడ్స్ జీపీవో సెంటర్ లో జరగనున్న జాతీయ గీతాలాపనలో పాల్గొంటారు. అన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్...
వాహనాలు కూడా ఆ సమయంలో నిలిపి వేసి జాతీయ గీతాలాపన చేయాలని అధికారులు నిర్ణయించారు. కూడళ్ల వద్ద మైకులను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అన్ని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ను వేస్తారు. వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ జాతీయ గీతాలాపనలో పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Next Story

