Mon Feb 17 2025 11:25:01 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో మళ్లీ ఆరోగ్య శ్రీ సేవలు
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. తమకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించాలంటూ కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేలను కార్పొరేట్ ఆుపత్రులు నిలిపివేశాయి. దీంతో నెట్వర్క్ హాస్పిటళ్లతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సఫలం అయ్యాయి.
చర్చలు సఫలం...
నిన్నటి రాత్రి నుంచి యథావిధిగా ఆరోగ్య శ్రీ సర్వీసులు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న బిల్లులు ప్రభుత్వం చెల్లించడంలో జాప్యం జరుగుతుందని అని హాస్పటల్స్ ఆరోగ్యశ్రీ కౌంటర్స్ కొన్ని రోజులు గా ముసివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి వారితో చర్చలు ప్రారంభించింది.
Next Story