Sun Feb 01 2026 06:26:11 GMT+0000 (Coordinated Universal Time)
అరికెపూడి గాంధీ కూడా మారిపోయారు
బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయి

బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్లో చేరారు. రేవంత్రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికతో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి పెరిగింది.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానని ప్రకాశ్ గౌడ్ వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Next Story

