Sun Mar 15 2026 06:28:50 GMT+0530 (India Standard Time)
Congress : బుజ్జగింపులు.. తర్వాత ప్రకటన
రాష్ట్ర నేతలకు పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఢిల్లీలో బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి

రాష్ట్ర నేతలకు పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఢిల్లీలో బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి. కేసీ వేణుగోపాల్ ఇంటికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు చేరుకున్నారు. వారితో తాము ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించనున్నారు. పార్టీ భవిష్యత్ తో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేశామని వారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
భేటీ ముగిసిన తర్వాత...
ఈ కీలక భేటీ ముగిసిన తర్వాత డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. ఇక్కడ ఎల్లా హోటల్ లో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశమై సీఎల్పీ నేత పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. మరో వార్త కూడా వినిపిస్తుంది. కేసీ వేణుగోపాల్ ఇంట్లో చర్చలు ఫలప్రదం అయితే ఢిల్లీలోనే సీఎల్పీ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు.
Next Story

