Sun Dec 14 2025 13:30:23 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎక్స్ ప్రెస్ లో పొగలు... ఒక్కసారిగా?
ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. వరంగల్ సమీపంలో దాదాపు గంట సేపు నుంచి రైలును నిలిపివేశారు

ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. వరంగల్ సమీపంలో దాదాపు గంట సేపు నుంచి రైలును నిలిపివేశారు. ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలులు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే ఏపీ ఎక్స్ ప్రెస్ విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళుతుంది.
ఎస్ 6 బోగీలో....
వరంగల్ జిల్లా నెక్కొండ స్టేషన్ లోకి రైలు రాగానే మంటలు కనిపించాయి. దీంతో రైలును నిలిపివేశారు. మంటలను ఆర్పివేశారు. బ్రేకులు జామ్ కావడంతోనే ఈ సమస్య వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రైలును నిలిపివేసి తనిఖీలు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై విచారణ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
- Tags
- ap express
- fire
Next Story

