Sun Mar 15 2026 17:43:39 GMT+0530 (India Standard Time)
KTR : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు
ఫార్ములా ఈ రేస్ కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఫార్ములా ఈ రేస్ కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కారు రేసింగ్ కేసులో ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ ను ఏ1 నిందితుడిగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఈడీ విచారణకు ఒకరోజు ముందు...
అయితే ఇదే కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే 7వ తేదీన ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు ఒకరోజు ముందు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

