Sun Mar 15 2026 14:09:16 GMT+0530 (India Standard Time)
ఫార్ములా ఈరేస్ లో స్పీడ్ పెంచిన ఏసీబీ
ఫార్ములా-ఈ రేసు కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు స్పీడ్ పెంచారు

ఫార్ములా-ఈ రేసు కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే హైకోర్టు నుంచి ఉత్వర్వులు అందుకున్న ఏసీబీ అధికారులు మొదటి అడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి దాన కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. దాదాపు ఏడు గంటల పాటు ఆయన నుంచి సమాచారాన్ని సేకరించారు.
దాన కిషోర్ స్టేట్మెంట్ ను...
దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. దానకిషోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లు తీసుకున్న ఏసీబీఅధికారులు ఆయనస్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేశారు. అనంతరం మరో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆ తర్వాత కేటీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశముంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

