Fri Dec 05 2025 14:59:39 GMT+0000 (Coordinated Universal Time)
Tealangana : ఫార్ములా ఈ రేసు కేసులో మళ్లీ విచారణ.. నోటీసులు సిద్ధం చేస్తున్న ఏసీబీ?
తెలంగాణ లో అవినీతి నిరోధక శాఖ రెండో విడత ఫార్ములా ఈ రేసు కేసులో విచారణ చేయాలని నిర్ణయించింది.

తెలంగాణ లో అవినీతి నిరోధక శాఖ రెండో విడత ఫార్ములా ఈ రేసు కేసులో విచారణ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నోటీసులు సిద్ధం చేసినట్లు సమాచారం. రెండో విడత ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు అంతా రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఈ ఫార్ములా రేస్ ను నిర్వహించిన గ్రీన్ కో ఏస్ నెక్ట్స్ జెన్ అందించిన డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం ఏసీబీ అధికారులు ఈ కేసులో మరికొందరిని విచారించడానికి సిద్ధమయ్యారు. ఏసీబీ అధికారులు ఈ మేరకు నోటీసులు సిద్ధం చేసి వారికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మలి విడత విచారణ...
ఫార్ములా ఈ రేసు కేసులో ఇప్పటికే కొందరిని విచారించిన ఏసీబీ అధికారులు మలి విడత విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎస్ఎన్ రెడ్డి, అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా విచారించిన ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ నిధులను మంత్రివర్గం ఆమోదం లేకుండా అనుమతి లేకుండా సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణలపై మరోసారి విచారించాలని ఏసీబీ నిర్ణయించింద.ి
మరోసారి పదిమందికి...
యాభై ఐదు కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు తేలడంతో దీనీపై ఇప్పటి వరకూ 24 మంది సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డు చేసిన ఏసీబీ అధికారులు లోతుగా ఈ కేసును అధ్యయనం చేసిన అనంతరం మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. పది మందిలో కేటీఆర్ కూడా ఉండే అవకాశాలున్నాయి. కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలిచి మరికొన్ని విషయాలను రాబట్టాలని ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అలాగే అరవింద్ కుమార్, బీఎస్ఎన్ రెడ్డిలను కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎవరెవరికి నోటీసులు ఏసీబీ అధికారులు పంపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

