Sun Mar 15 2026 23:03:07 GMT+0530 (India Standard Time)
కోమటిరెడ్డి.. కామెంట్స్.. మరోసారి
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇంకొకటి వైరల్ అయింది.

పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇంకొకటి వైరల్ అయింది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన అక్కడ ాయన తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిన్న ఆడియో లీక్ కాగా, ఈరోజు వీడియో బయటకు వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆడియో రూపంలో బయటపడ్డాయి.
రిటైర్మెంట్ తీసుకుంటానని....
ఈరోజు బయటకొచ్చిన వీడియోలో మునుగోడులో కాంగ్రెస్ గెలవదని చెప్పారు. తాను ప్రచారం చేసినా పది వేల ఓట్లకు మించి రావని ఆయన అన్నారు. అందుకే తాను ప్రచారానికి దూరంగా ఉన్నానని తన సన్నిహతుల వద్ద వ్యాఖ్యానించారు. రెండు అధికార పార్టీల మధ్య కాంగ్రెస్ పోరాడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. తాను 25 ఏళ్ల పాటు రాజకీయాలు చేశానని, ఇక తాను విశ్రాంతి తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం పార్టీలో చర్చనీయాంశమైంది.
Next Story

