Mon Mar 16 2026 05:29:50 GMT+0530 (India Standard Time)
Breaking : బీఆర్ఎస్ కు షాకింగ్ న్యూస్.. మరో ఎంపీ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి మరో షాకింగ్ న్యూస్. ఆ పార్టీకి మరో ఎంపీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు

బీఆర్ఎస్ పార్టీకి మరో షాకింగ్ న్యూస్. ఆ పార్టీకి మరో ఎంపీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు తనకు అవకాశం కల్పించినందుకు ఆయన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
రానున్న ఎన్నికల్లో...
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి పోటీ చేయడానికి ఆయన అంగీకరించలేదు. దీంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రంజిత్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. ఇప్పుడు రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరుతుందన్నది మాత్రం తెలియచేయలేదు.
Next Story

