Fri Dec 05 2025 13:36:23 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ధరణి కమిటీ సమావేశం.. ఆ భూములపైనే
తెలంగాణలో భూ సమస్యలను పరిష్కరించడానికి నేడు మరోసారి ధరణి కమిటీ సమావేశం జరగనుంది.

తెలంగాణలో భూ సమస్యలను పరిష్కరించడానికి నేడు మరోసారి ధరణి కమిటీ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో ముఖ్య శాఖల అధికారులు పాల్గొననున్నారు. ప్రధానంగా వక్ఫ్ బోర్డు, దేవాదాయ శాఖ భూముల విషయంలో ఈ కమిటీ అధికారుల నుంచి సమాచారం సేకరించనుంది. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్ లో ప్రజల నుంచి వస్తున్న వివిధ సమస్యలను గురించి చర్చించిన సంగతి తెలిసిందే.
ఆక్రమణలకు గురయ్యాయని...
వేలాది ఎకరాల దేవాదాయ, వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు మాయమయ్యాయన్న ఆరోపణలతో కమిటీ ప్రత్యేకంగా దీనిపై అధికారులతో చర్చించి ఎక్కడెక్కడ భూములు ఆక్రమణకు గురయింది? ఇతరుల చేతుల్లోకి వెళ్లింది? వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఇప్పటికే ధరణి పోర్టల్ లో వీటికి సంబంధించిన భూములను రికార్డుల పరంగా కొందరి సొంతమయినట్లు ఆరోపణలు రావడంతో కమిటీ ప్రత్యేకంగా ఈ రెండు భూముల విషయంపైనే సమావేశం జరుపుతుంది.
Next Story

