Thu Mar 26 2026 04:59:14 GMT+0530 (India Standard Time)
బీజేపీ లో చేరిన కాంగ్రెస్ నేత
బీజేపీలో మరో కాంగ్రెస్ పార్టీ నేత చేరారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్ బీజేపీలో చేరారు

భారతీయ జనతా పార్టీలో మరో కాంగ్రెస్ పార్టీ నేత చేరారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్ బీజేపీ లో చేరారు. అదెల్లి పోచమ్మ గుడివద్ద బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో రామరావు పటేల్ కమలం తీర్థం పుచ్చుకున్నారు.
సీనియర్ నేత....
రామారావు పటేల్ సీనియర్ నేత. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంత పట్టున్న నేత. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. పటేల్ రామారావుతో పాటు మరికొందరు మండల స్థాయి నేతలు కూడా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సాదరంగా రామరావు పటేల్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
- Tags
- ramarao patel
- bjp
Next Story

