Thu Apr 02 2026 19:37:08 GMT+0530 (India Standard Time)
Congress : అనిరుధ్ రెడ్డి లక్ష్యం ఏంటి? ప్రచారం కోసమా? మరి?
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. తొలి సారి ఎమ్మెల్యే అయిన అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒకసారి క్రమశిక్షణ కమిటీకి కూడా అనిరుధ్ రెడ్డి వ్యవహారం వెళ్లింది. ఆయన అనేక సార్లు పలు అంశాలపై తన మనసులో మాటను బయటకు చెప్పడంతో అవి వివాదాస్పదంగా మారాయి. గతంలో ఆంధ్ర ప్రాంత ప్రజలపైన కూడా అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి తలనొప్పిని తెచ్చారు. చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి.
చంద్రబాబు కోవర్టులంటూ...
ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, రహదారుల కాంట్రాక్టుల కోసం చంద్రబాబు కోవర్టులు హైదరాబాద్ లో దందాలు చేస్తున్నారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. వారి ఇళ్లకు నల్లా కనెక్షన్లు, విద్యుత్తు కనెక్షన్లు తీసివేస్తే వాళ్లే చంద్రబాబు వద్దకు వెళ్లి బనకచర్లను ఆపమని అడుక్కుంటారంటూ వ్యాఖ్యానించి పార్టీని ట్రబుల్ లో పడేశారు. సున్నితమైన సమస్యలపై అనిరుధ్ రెడ్డి మాట్లాడుతుండటంతో హైకమాండ్ కూడా పిలిచి కొంత హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పైన కూడా అనిరుధ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ లో డ్రగ్స్ టెస్ట్ లంటూ...
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు విలువలేదంటూ మరొకసారి అనిరుధ్ రెడ్డి ఫైరయ్యారు. అంతటితో ఆగకుండా ఇలాగే చే్తే తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఇక తాజాగా సినీ ఇండ్రస్ట్రీ పై అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. సినీ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. డ్రగ్స్ నియంత్రణ కోసం సినీ హీరోలు ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలని కోరారు. అయితే సినీ ఇండ్రస్ట్రీ నుంచి పెద్ద యెత్తున విమర్శలు తిరిగి అనిరుధ్ రెడ్డిపై వచ్చాయి. మంచు విష్ణుతో పాటు కొందరు సినీ తారలు ఘాటుగా స్పందించారు. లేనిపోని అంశాలను తలకెత్తుకుంటూ పార్టీకి అనిరుధ్ రెడ్డి శిరోభారంగా మారారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story

