Sat Dec 06 2025 00:44:05 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : హైదరాబాద్ లో ఏపీ మంత్రుల భేటీ
ఈరోజు సాయంత్రం జరిగే ముఖ్యమంత్రుల భేటీలో ప్రస్తావించవలసిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు అధికారులతో చర్చిస్తున్నారు

ఈరోజు సాయంత్రం జరిగే ముఖ్యమంత్రుల భేటీలో ప్రస్తావించవలసిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు అధికారులతో చర్చిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ప్రజాభవన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్న సంగతి తెలిసిందే.
రెండు రాష్ట్రాల మధ్య...
రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఈ చర్చలు జరగున్నాయి. ఈ సమావేశానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ లు కూడా హాజరు కానున్నారు. వీరు హెరిటేజ్ భవన్ లో సమావేశమై తెలంగాణ ప్రభుత్వంపై చర్చించాల్సిన విషయాల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
Next Story

