Thu Mar 19 2026 14:24:54 GMT+0530 (India Standard Time)
అప్పలరాజు తిక్కరేగింది.. వీడియో విడుదల
ఏపీ మంత్రి అప్పలరాజుకు విశాఖ శారదపీఠం వద్ద అవమానం జరిగిందన్న ప్రచారం జరిగింది

ఏపీ మంత్రి అప్పలరాజుకు విశాఖ శారదపీఠం వద్ద అవమానం జరిగిందన్న ప్రచారం జరిగింది. ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి అప్పలరాజు కూడా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే ఈ విషయంలో మరో కోణం వెలుగు చూసింది. మంత్రి అప్పలరాజు పోలీసుల పట్ల అనుచితంగా వ్యవహరించారన్న విషయం స్పష్టమయింది. ఈ మేరకు విశాఖ పోలీసులు ఒక వీడియోను విడుదల చేశారు.
పోలీస్ అధికారి చొక్కాను....
ఈ వీడియోలో ఒక పోలీసు అధికారి చొక్కాను మంత్రి అప్పలరాజు పట్టుకున్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. శారదాపీఠంలో జగన్ పాల్గొనే కార్యక్రమం పూర్తిగా ప్రయివేటు కార్యక్రమం. ఇందులోకి పాస్ లు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తారు. మంత్రి హోదాలో అప్పలరాజు ఒక్కరికే అనుమతి ఉందని అక్కడి సీఐ స్పష్టం చేశారు. దీంతో అప్పలరాజుకు తిక్కరేగి తన అనుచరులముందే మంత్రినైనా తనను అవమానిస్తాడా? అంటూ కాలర్ పట్టుకున్నట్లు ఈ వీడియోలో స్పష్టమయింది. విశాఖ పోలీసుల పట్ల మంత్రి అప్పలరాజు వ్యవహరించిన తీరు పట్ల పోలీసు అధికారులు సయితం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Next Story

