Sun Mar 15 2026 10:54:40 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మొక్కులు చెల్లించుకున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్ తన ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆయన తరచూ కొండగట్టుకు వచ్చి పూజలు నిర్వహిస్తారు.
ప్రత్యేక పూజలు...
తమ అభిమాన హీరోను చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు కొండగట్టుకు చేరుకున్నారు. ఆలయ అధికారులు పవన్ కల్యాణ్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ఉదయం పదకొండు గంటలకు బయలుదేరిన పవన్ కల్యాణ్ ను అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికారు. తుర్కపల్లి వద్ద గజమాలతో ఆయనను సత్కరించారు. అందరికీ నమస్కరిస్తూ ఆయన ముందుకు వెళ్లారు. తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలసి పనిచేస్తుందని ఆయన తెలిపారు.
Next Story

