Wed Dec 17 2025 14:15:40 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి పవన్ ట్వీట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలపడమే కాకుండా తనకు జన్మ నిచ్చిన నేల అని, ఉద్యమ స్ఫూర్తి ని తనలో నింపిన ప్రాంతమని తెలంగాణ ప్రాంతాన్ని పవన్ కల్యాణ్ తన ట్వీట్ ద్వారా తెలిపారు.
ట్వీట్ ఇదే...
"జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని ట్వీట్ లో తెలిపారు.
Next Story

