Sat Mar 07 2026 14:42:50 GMT+0530 (India Standard Time)
Ys jagan : కేసీఆర్ ఆరోగ్యంపై జగన్ ఆరా
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎ జగన్ ఆరా తీశారు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎ జగన్ ఆరా తీశారు. జగన్ ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాలు తుంటి ఎముక విరగడంతో ఆయన యశోదా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన కాలికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదని తెలిసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేశారు.
ఫోన్ చేసి అడిగి...
ఆయనను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ నిన్న అర్ధరాత్రి పంచె తట్టుకుని బాత్ రూంలో కాలు జారి పడటంతో వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
Next Story

