Sun Mar 15 2026 16:36:18 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశంకానున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు నిన్నంతా హైదరాాద్ లోని తన నివాసంలోనే ఉన్నారు. ముఖ్యమైన నేతలను కలిశారు. ఈరోజు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
పార్టీ బలోపేతంపై...
ఈ సమావేశంలో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వం, టీటీడీపీ కొత్త అధ్యక్షుడి నియామకం వంటి వాటిపై చర్చిస్తారని తెలిసింది. ఇటీవల ఆయన సమావేశమై ప్రతి మూడో శని, ఆదివారాలు తాను టీటీడీపీ నేతలతో సమావేశమవుతానని చెప్పిన నేపథ్యంలో ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు
Next Story

