Sun Mar 15 2026 23:32:23 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు హైదరాబాద్కు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ రానున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ రానున్నారు. కోనసీమ జిల్లాలో గ్రామ సభలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి నేరుగా హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట ఎయిర్ పోర్టులో దిగనున్నారు.
టీటీడీపీ నేతలతో...
అయితే రేపు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు చెప్పారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆదేశాలు ఇవ్వనున్నారు.
Next Story

