Mon Mar 16 2026 16:43:42 GMT+0530 (India Standard Time)
డేంజర్.. అయినా ప్రయాణం
అందెవల్లి వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. ప్రమాదకరంగా అందెవల్లి వంతెన ఉందని ప్రమాదకర హెచ్చరిక జారీ చేశారు.

అందెవల్లి వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. ప్రమాదకరంగా అందెవల్లి వంతెన ఉందని ప్రమాదకర హెచ్చరిక జారీ చేశారు. కొమురంభీం జిల్లాలో ఈ వంతెన కీలకం. రాకపోకలను దీనిపై నిషేధించారు. వంతెనపై నుంచి విద్యార్థులు రాకపోకలను కొనసాగిస్తున్నారు. వేరే మార్గం లేకపోవడంతో ఆ ప్రాంతం నుంచే అందరూ ప్రయాణించాల్సి వస్తుంది.
హెచ్చరిక బోర్డు పెట్టినా...
ఈ వంతెన ప్రమాదకరంగా మారిందని అధికారులు గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులను నియమించకపోవడంతో అదే వంతెన పై నుంచి అనేక మంది ప్రయాణిస్తుండటం ఆందోళన కల్గిస్తుంది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఈ వంతెన దాటి అవతలి వైపు ఉన్న బస్సు వద్దకు చేరుకుంటున్నారు. ఈ వంతెనకు వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story

