Wed Dec 17 2025 14:07:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వరంగల్ లో బీజేపీ సభ
నేడు వరంగల్ లో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ జరగనుంది.

నేడు వరంగల్ లో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ జరగనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరగనుంది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ సభ జరుగుతుంది. సభ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. మధ్యాహ్నానికి బండి సంజయ్ పాదయాత్ర వరంగల్ కు చేరుకోనుంది. సంజయ్ కు స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున పార్టీ శ్రేణులు సిద్దమవుతున్నారు.
పాదయాత్ర ముగింపు...
వరంగల్ లో బీజేపీ ముగింపు సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది కోర్టు షరతుల మధ్య బహిరంగ సభ జరగనుంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

