Thu Mar 19 2026 08:52:44 GMT+0530 (India Standard Time)
తమ్మినేని వీరభద్రం సోదరుడు దారుణ హత్య
ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు.

ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కృష్ణయ్యను దుండగులు హత మార్చారు. నరికి చంపారు. దీంతో తెల్దారుపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తమ్మినేని వీరభద్రం సోదరుడు...
తమ్మినేని కృష్ణయ్య సీపీఎంతో విభేదించి టీఆర్ఎస్ లో చేరారు. ఆయన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా కొనసాగుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. కృష్ణయ్యను హత్య చేసిన దుండగుల కోసం పోలీసులు వెదుకుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

