Wed Jan 21 2026 02:07:19 GMT+0000 (Coordinated Universal Time)
రేపు తెలంగాణకు అమిత్ షా..
తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రేపటితో ముగియనుండగా.. అమిత్ షా ముగింపు సభకు

హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రేపటితో ముగియనుండగా.. అమిత్ షా ముగింపు సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రజాసంగ్రామ యాత్ర మహబూబ్ నగర్లో ముగించగా.. ఆ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైన విషయం తెలిసిందే. రెండో దశ ముగింపు సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు. రంగారెడ్డి జిల్లా పరిస్థిలోని తుక్కుగూడలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు భారీ బహిరంగసభ జరగనుందని.. తెలంగాణ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Next Story

