Wed Jan 28 2026 21:02:11 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా పర్యటన.. వాళ్లకు మరోసారి బ్యాడ్ న్యూస్
అమిత్ షా జులై 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు

తెలంగాణలో అమిత్ షా సభ రద్దయింది. జులై 29న ఖమ్మంలో జరగాల్సిన సభకు అమిత్షా రాలేకపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో షా సభను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ బీజేపీ తెలిపింది. సభ రద్దు అయినప్పటికీ.. తెలంగాణలో షా టూర్ యథాతధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 29న తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమంతో పాటు మేధావులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
జూన్ నెల 15న ఖమ్మంలో బీజేపీ సభ జరగాల్సి ఉంది. ఆ సభకు అమిత్ షా హాజరుకావాల్సి ఉంది. అప్పట్లో బిపర్జాయ్ తుఫాన్ కారణంగా షా పర్యటన రద్దయింది. ఇప్పుడు మరోసారి వర్షాల వల్ల ఖమ్మం రద్దు అయింది. ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలని ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉంది. అమిత్ షా పర్యటనలో పలువురు నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించాలని భావించారు బీజేపీ నాయకులు. కానీ వాతావరణం కారణంగా వారికి మరోసారి బ్యాడ్ న్యూస్ వినిపించింది.
అమిత్ షా జులై 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్షించనున్నారు. కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీజేపీ ఎన్నికలపై దృష్టి పెట్టింది.
Next Story

