Sun Mar 08 2026 06:31:28 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పాఠశాలలకు ఈరోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పాఠశాలలకు ఈరోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది.
మధ్యాహ్నం 12 వరకూ...
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మధ్యాహ్న భోజనం అందించి పిల్లలను ఇంటికి పంపాలి విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏటా లాగానే ఈ ఏడాది కూడా మర్చి 15 నుంచి పాఠశాలలకు విద్యాశాఖ ఒంటిపూట బడులు ప్రారంభించింది.
Next Story

