Wed Feb 19 2025 21:35:16 GMT+0000 (Coordinated Universal Time)
రేపు టి. కాంగ్రెస్ అసంతృప్త నేతల సమావేశం
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతలంతా సమావేశం కాబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతలంతా సమావేశం కాబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ సీనియర్ నేతలు చర్చించనున్నారు.
హైకమాండ్ అపాయింట్ మెంట్ కోసం...
ఇప్పటికే వి.హనుమంతరావు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీలో రేవంత్ తమను అవమానాలకు గురి చేస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం వీరు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి పీసీసీ నాయకత్వం వ్యవహారశైలి పై హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నారు.
Next Story