Sat Mar 07 2026 13:03:07 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణాలో ఆలయాలు మూతబడే సమయమిదే
తెలంగాణలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను నేడు చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు

తెలంగాణలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను నేడు చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు. ఈరోజు రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో మధ్యాహ్నం నుంచి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట, భద్రాచలం, వేముల వాడ, వరంగల్ లోని భద్రకాళీ ఆలయాన్ని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాలు మూతపడనున్నాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈలోపు నిత్య కైంకర్యాలు, నివేదన నిర్వహించి ద్వార బంధనం చేయనున్నారు.
రేపు ఉదయం నుంచి...
రేపు తెల్లవారు జామున 3.30 టంటలకు ఆలయాల సంప్రోక్షణ చేసిన అనంతరం ఉదయం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని ఆలయఅధికారులు తెలిపారు. రేపు ఉదయం 7.10 గంటల తర్వాత రెండు దఫాలుగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయనున్నాట్లు తెలిపారు. భద్రాలం సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేయనున్నారు. తిరిగి రేపు ఉదయం 7.30 గంటలకు దర్శనాలకు అనుమతిస్తారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ఉదయం 11.30 గంటలకు మూసివేయనున్నారు. రేపు ఉదయంఆలయానని తెరుస్తారు.
Next Story

