Mon Jul 04 2022 05:47:27 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మెట్రో స్టేషన్ల మూసివేత

హైదరాబాద్ మెట్రో స్టేషన్లన్నింటిని మూసివేశారు. ఎవరూ మెట్రో స్టేషన్ కు రావద్దని, రైళ్లను రద్దు చేశామని అధికారులు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనతో మెట్రో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కాల్పులు జరిపి ఆందోళనకారులు చెదరగొడితే వారు సిటీలో ఉన్న మెట్రో స్టేషన్ లకు చేరుకోవచ్చని ముందు జాగ్రత్తగా మెట్రో స్టేషన్లను మూసివేశారు.
అదుపులోకి వచ్చేంత వరకూ...
పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకూ మెట్రో రైళ్లు నడవవని అధికారులు చెబుతున్నారు. మైట్రో రైల్వే స్టేషన్ల వద్ద భారీ బందబోస్తును ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇతర మార్గాల ద్వారా తమ గమ్యం చేరుకోవాలని, మెట్రో రైళ్లు పునరద్ధరణ ప్రకటన తర్వాత చేస్తామని చెప్పారు.
Next Story