Sat Mar 07 2026 16:32:44 GMT+0530 (India Standard Time)
మునుగోడు ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
మునుగోడు ఉప ఎన్నికల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.

మునుగోడు ఉప ఎన్నికల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. మొత్తం 2.41 లక్షల మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం 1,192 మంది సిబ్బందిని నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి మైక్రో అబ్జర్వర్ ను నియమించారు.
గ్రామాలకు చేరుకున్న...
మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి సిబ్బంది ఇప్పటికే ఆ యా గ్రామాలకు చేరుకున్నారు. యాభై వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ మంది సిబ్బందిని నియమించారు. ఓటర్లను రాత్రికి ప్రలోభ పెట్టకుండా నిఘా బృందాలను కూడా నియమించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

