Sun Mar 08 2026 09:48:00 GMT+0530 (India Standard Time)
నేడు దత్తన్న అలయ్ బలయ్... హాజరు కానున్న మెగాస్టార్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు అలయ్ భలయ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. ప్రతి ఏడాది దసరా పండగ మరుసటి రోజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ భలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతి ఏడాది....
ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల రాజకీయ నేతలు హాజరవుతారు. అందరూ కలసి సరదాగా కొద్దిసేపు కలిసి ముచ్చటించుకుంటారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ జరుపుతారు. ఈసారి ఈ కార్యక్రమంలో చిరంజీవిని దత్తాత్రేయ సన్మానించనున్నారు. నిన్న చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించడంతో ఆయన వస్తానని చెప్పారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

