Thu Dec 18 2025 17:52:53 GMT+0000 (Coordinated Universal Time)
Akbaruddin Owaisi మీ ఆఫర్ నాకొద్దు: అక్బరుద్దీన్ ఒవైసీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ తనకు వద్దని

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ తనకు వద్దని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. డిప్యూటీ సీఎంను చేస్తానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. తాను మజ్లిస్ పార్టీలోనే ఉంటానని, పార్టీలో సంతోషంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. చివరి శ్వాస వరకు మజ్లిస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదేనని, కానీ ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నెరవేర్చాలన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే హైదరాబాద్కు మెట్రో రైలు వచ్చిందన్నారు. హైదరాబాద్ పట్టణానికి మెట్రో రావడానికి తాను కూడా కృషి చేశానన్నారు.
అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి దగ్గరుండి నామినేషన్ వేయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంతకు ముందు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అక్బరుద్దీన్ ఒవైసీని ఉపముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. పాతబస్తీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణగుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ ను అక్బరుద్దీన్ ఒవైసీ తిరస్కరించారు.
Next Story

