Tue Apr 07 2026 03:00:41 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అగ్రనేతల భేటీ
నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు

నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. నిన్ననేతెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం పది గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమావేశమవుతారు. ముంబయి నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీకి నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ మంత్రులు, పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రులతో ఏఐసీసీ నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోపార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు, శాఖల మార్పులపై కూడా చర్చించే చాన్స్ ఉందంటున్నారు.
రెండేళ్లవుతున్న సందర్భంగా...
ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న సందర్భంలో పాలన, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తారని తెలిసింది. అలాగే మంత్రుల మధ్య సమన్వయ లోపంతో పాటు మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముందని తెలిసింది.
Next Story

