Sun Mar 15 2026 16:04:34 GMT+0530 (India Standard Time)
ఓయూ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం
భుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే టీఆర్ఎస్ నేతలు ఓయూ కు రావాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే టీఆర్ఎస్ నేతలు ఓయూ కు రావాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయకుండా యువత భవిష్యత్ ను నాశనం చేస్తుందని ఆందోళనకు దిగారు.
పోలీసులు అడ్డుకుని...
ఈ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ వద్ద ఒక విద్యార్థి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ పెట్రోలు పోసుకుని హడావిడి చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే యువకుడిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story

