Mon Mar 16 2026 10:26:27 GMT+0530 (India Standard Time)
Telangana : నేటి నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11.45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఓకే ప్రాంగణంలోకి శాసనసభ శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. పాత అసెంబ్లీ హాల్లో శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ...
ఉదయం 11.27, గంటల నుంచి 11:37 నిమిషాల సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహం కార్యక్రమానికి శాసన మండలి శాసనసభ సభ్యులు అందరూ హాజరుకావాలని సూచించారు. ▪️గవర్నర్, సిఎం, మండలి చైర్మన్, స్పీకర్ చేతుల మీదుగా ఆవిష్కరణ ఉండనుంది. ఉదయం 11:40 కి అసెంబ్లీ సంయుక్త సమావేశం ప్రారంభమవుతాయి. 11.45కి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు.
భారీ బందోబస్తు...
బడ్జెట్ సమావేశాల్లో హాట్ హాట్ డిస్కషన్స్ జరగనున్నాయి. సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. వివిధ బిల్లులను ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఆమోదించనుంది. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. పోలీసులు భారీ భద్రతను మొహరించారు. ఎటువంటి ఆందోళనలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.
Next Story

