Sat Mar 14 2026 16:25:33 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు తెలంగాణ బంద్.. స్కూళ్లకు సెలవులు
తెలంగాణ బంద్ కు నేడు ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపు నిచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి.

తెలంగాణ బంద్ కు నేడు ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపు నిచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. కొమురం భీం జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలంటూ ఆదివాసీలు ఈ బంద్ కు పిలుపు నిచ్చారు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల అప్రమత్తం...
గిరిజనులను రక్షించడానికి అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే మంత్రి సీతక్క పర్యటన జిల్లాలో ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

