Thu Jan 29 2026 20:29:44 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిలాబాద్ లో వర్షం.. ఆనందం మామూలుగా లేదుగా
రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్న సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడింది.

ఎండలు మండిపోతున్న సమయంలో వర్షాలు పడితే అంతకంటే మజా ఏముంటుంది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో అదే జరుగుతుంది. రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్న సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. తీవ్రమైన ఎండలు దంచికొడుతున్న వేళ ఆదిలాబాద్ అర్బన్ ప్రాంతంలో 22.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
నీటి ఎద్దడి సమయంలో...
కొమురం భీం జిల్లాలో 9 మిల్లి మీటర్ల వర్షపాతం కురిసింది. నిర్మల్ జిల్లాలోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. నీటి ఎద్దడి తలెత్తుతున్న వేళ ఈ వర్షం పెద్దగా ఉపయోగపడకపోయినా ఎండలు ముదురుతున్న వేళ వర్షం పడటం కాసింత ఉపశమనంగానే చూడాలి. వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించినట్లు వర్షం కురిసి కొంత నేలతల్లి పులకించింది.
Next Story

